సింగపూర్ లో వెంకటేశ్వర స్వామి గానామృత నృత్య నాటిక
సింగపూర్ లో Harmony & Hues ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము మరియు గానామృత సంగీత నృత్య నాటికా ప్రదర్శన నిర్వహించారు. స్వరలయ ఆర్ట్స్ వ్యవస్థాపక గురువులు వై.శేషుకుమారి గానామృతంలోని సన్నివేశాలను రసవత్తమైన 30 రాగాలతో 60 పాటలతో సన్నివేశాలు స్వరపరిచారు. కూచిపూడి గురువులు డాక్టర్ వై.నిషితా శిష్యులు తమ జతులతో నృత్యం జతపరిచి మైమరిపించగా, జానపదాలతో కోలాటాలతో గురు బి.క్రాంతి శిష్యులు అలరింపగా వేదికపై స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవముగా జరిగింది. Harmony & Hues సంస్థ ప్రారంభించిన మూడు నెలలలోనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించడాన్ని అతిథులు అభినందించారు. Harmony & Hues కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి శ్యామల-మహేష్, కొణిజేటి విష్ణుప్రియ-రవి, ఆలపాటి రాఘవలు తదితరులు పాల్గొన్నారు.